NEWSANDHRA PRADESH

జ‌నం జ‌ర భ‌ద్రం గ‌వ‌ర్న‌ర్ విన్న‌పం

Share it with your family & friends

ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచ‌న

అమ‌రావ‌తి – భారీ వ‌ర్షాల కార‌ణంగా రాష్ట్రంలోని ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని విన్న‌వించారు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఎస్. అబ్దుల్ న‌జీర్. రాష్ట్ర టీడీపి కూట‌మి ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌ల‌లో నిమ‌గ్నమై ఉంద‌ని తెలిపారు. సోమ‌వారం రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు గ‌వ‌ర్న‌ర్.

భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో జన జీవనం అస్తవ్యస్తంగా మారిందని ఎస్.అబ్దుల్ నజీర్ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, ప్రభుత్వ అధికారుల సహాయంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్లవద్దని గవర్నర్ హెచ్చరించారు.

ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారు ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని, తద్వారా వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

రెడ్‌క్రాస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇతర ఎన్‌జీవోలు ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. బాధితులకు ఆహారం, మందులు, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీలో రెస్క్యూ , రిలీఫ్ ఆపరేషన్‌లలో చురుకుగా పాల్గొనాలని గవర్నర్ అబ్దుల్ న‌జీర్ కోరారు.

వర్షాల కారణంగా సంభవించిన ప్రాణ నష్టంపై సంతాపం వ్యక్తం చేశారు .