డిప్యూటీ సీఎంకు ఛాంబర్ కేటాయింపు
ఏపీ సచివాలయంలోని 2వ బ్లాక్ 211 గది
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ చీఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొలువు తీరారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ సమోక్షంలో ప్రమాణం చేశారు. అయితే సచివాలయానికి రాలేదు.
అయితే ప్రమాణం చేసిన వెంటనే సెక్రటేరియేట్ లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు నారా చంద్రబాబు నాయుడు. ఆయన అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించారు. అంతే కాకుండా పోలవరాన్ని సందర్శించారు.
ఉన్నతాధికారుల పనితీరుపై సమీక్ష చేపట్టారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కు వంత పాడిన వారిని పక్కన పెట్టారు. ఇదే సమయంలో పని చేసే వారికి ప్రయారిటీ ఉంటుందని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సచివాలయంలోని 2వ బ్లాక్ ను కేటాయించారు. ఇందులో 211 గదిని ఏర్పాటు చేశారు. ఆయన పక్కనే జనసేన పార్టీకి చెందిన మరో ఇద్దరు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్దేష్ కు పక్క పక్కనే గదులు కేటాయించడం విశేషం.