NEWSANDHRA PRADESH

అమ‌రావతి నిర్మాణంలో ముద‌డుగు

Share it with your family & friends

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి – ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నోటిఫై చేస్తూ గెజిట్ జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నిర్మించాల‌ని నిర్ణ‌యించింది.

ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 1,575 ఎకరాల ప్రాంతాన్ని నోటిఫై చేసింది ఇప్ప‌టికే సీఆర్డీఏ క‌మిటీ. ఈ మేర‌కుమాస్టర్ ప్లాన్‍లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు ప్రక‌టించింది . సీఆర్డీఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం బహిరంగ ప్రకటన జారీ చేసిన సీఆర్డీఏ .

రాయపూడి, నేలపాడు గ్రామాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం ఇందులో ఉంది. లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం . ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల కోసం నోటిఫై చేస్తున్నట్లు తెలిపింది.

బహిరంగ ప్రకటన నోటిఫికేషన్ జారీ చేసిన సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్. ప్ర‌భుత్వం ఆదేశించిన ఈ మేర‌కు ఈ నోటిఫికేష‌న్ ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు.