మద్యం దుకాణాల కోసం 20,310 దరఖాస్తులు
వెల్లడించిన ఏపీ కూటమి ప్రభుత్వం
అమరావతి – మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఇప్పటి వరకు 20,310 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 9 బుధవారం వరకు మాత్రమే ఛాన్స్ ఉంది. చివరి తేదీ లోపు ఇంకా ఎన్ని దరఖాస్తులు వస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటి వరకు మద్యం దుకాణాల దరఖాస్తులకు సంబంధించి నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ఏకంగా రాష్ట్ర కూటమి సర్కార్ కు ఏకంగా రూ. 406 కోట్ల ఆదాయం లభించింది. ఈ విషయాన్ని సర్కార్ వెల్లడించింది. రేపటి సాయంత్రం లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది కూటమి సర్కార్.
ఇదిలా ఉండగా నిన్న ఒక్క రేజే రికార్డు స్థాయిలో 12,036 దరఖాస్తులు రావడం విశేషం. రాష్ట్రంలో మొత్తం 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీకి ఈ నెల ఒకటిన నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. ఒక్కో దుకాణానికి నాన్ రిఫండబుల్ రుసుం కింద 2 లక్షల రూపాయల దరఖాస్తు ఫీజును నిర్ణయించింది. ఆయా మద్యం దుకాణాలను చేజిక్కించు కునేందుకు భారీ ఎత్తున దరఖాస్తులు రావడం విశేషం. రేపటితో గడువు ముగియనుండడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తోంది కూటమి సర్కార్.