ఏపీలో కూటమి వచ్చాక పెట్టుబడుల జాతర
ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం , జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం కొలువు తీరాక కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
జగన్ అనే భూతాన్ని రాష్ట్రం నుండి ప్రజలు పారద్రోలిన తర్వాత చంద్రబాబు సీఎం అయిన తొలి వంద రోజుల్లోనే పెట్టుబడులు, ఉద్యోగాలతో రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులతో పాటు పరిశ్రమలు కూడా వచ్చాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రూ.172 కోట్లతో, విశాఖలో యూనిటీ మాల్ ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో 3 చోట్ల మాల్స్ మొదలు పెట్టడానికి సిద్దమైన లులు గ్రూప్ సంస్థ. రూ.2800 కోట్ల పెట్టుబడులకు గోద్రెజ్ ఆసక్తి కనబర్చిందని తెలిపింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు బ్రూక్ ఫీల్డ్ ఆసక్తి, హెచ్ సీ ఎల్ రెండో దశ విస్తరణకు రెడీ. 15 వేల మందికి ఉపాధి కల్పించేందుకు నిర్ణయం.
ఫాక్స్ కాన్ మెగా సిటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నారా లోకేష్ తో చర్చలు జరిపింది. చంద్రబాబు రాకతో జైరాజ్ ఇస్పాత్ రెండో దశ విస్తరణ మొదలు పెట్టింది. ఏపిలో యూనివర్సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన అపోలో. రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు ముందుకు వచ్చింది గూగుల్ కంపెనీ.
మెడికల్ యూనివర్సిటీ , ఏఐ యూనివర్సిటీ, ఇండస్ట్రియల్ రిసెర్చ్ ఏర్పాటు కానున్నాయి. పార్క్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. మల్లవల్లిలో 2019 నాటికి పూర్తయిన అశోక్ లేలాండ్ కంపెనీ గత 5 ఏళ్ళుగా ప్రారంభానికి నోచుకోలేదు. త్వరలోనే కంపెనీ కార్యకలాపాలు మొదలు కానున్నాయి.
అమరావతిలో రూ.250 కోట్లతో ఎక్స్ ఎల్ ఆర్ ఐ (XLRI ) క్యాంపస్ నిర్మాణం చేపట్టనుంది. అంతే కాకుండా
శ్రీసిటీలో రూ. 1570 కోట్ల పెట్టుబడులతో నెలకొన్న 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.శ్రీసిటీలో రూ.900 కోట్ల పెట్టుబడులతో రాష్ట్ర యువతకు 2740 ఉద్యోగాలను అందించే 6 సంస్థలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పెట్టుబడులకు సీఎం సమక్షంలో 5 సంస్థలతో పారిశ్రామిక ఒప్పందాలు. రూ.1213 కోట్ల పెట్టుబడులతో సుమారు 4000 ఉద్యోగాలు రానున్నాయి.
సబ్ స్ట్రేట్ మాన్యూఫ్యాక్చరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Substrate Manufacturing India Pvt. Ltd. ) అనే AI కంపెనీ విశాఖలో పెట్టుబడులు పెట్టనుంది. రాష్ట్రంలో హెలికాప్టర్ల తయారీకి ముందుకు వచ్చిన ఎయిర్ బస్ కంపెనీ. అనంతపురం జిల్లాలో పెట్టుబడులకు ఆసక్తిని కనబర్చిందని కూటమి సర్కార్ తెలిపింది.
రూ.520 కోట్లతో రాజమండ్రి ప్లాంట్ విస్తరణకు ముందుకు వచ్చిన ఆంధ్రా పేపర్స్ కంపెనీ. అంతే కాకుండా కడియంలో టిష్యూ పేపర్ యూనిట్ నెలకొల్పనుంది. మచిలీపట్నంలో రూ.70 వేల కోట్ల భారీ పెట్టుబడితో రిఫైనరీ ప్రాజెక్ట్ పెడుతున్న బీపీసీఎల్. సెల్ కాన్ సబ్సిడరీ రిసొల్యూట్ ఎలక్ట్రానిక్స్ తిరుపతిలో వైఫై రూటర్స్ తయారీ కంపెనీ పెట్టేందుకు ముందుకు వచ్చిందని వెల్లడించారు ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్.