దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం..స్వామికి షాక్
అమరావతి – ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతోంది. బుధవారం సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చించారు.
ఇదే సమయంలో గత ప్రభుత్వంలో విశాఖ శారదా పీఠంకు అడ్డగోలుగా కేటాయించిన భూములను రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేశారు. ఇందుకు కేబినెట్ పూర్తి మద్దతు తెలిపింది. దీంతో గత సీఎం జగన్ రెడ్డికి వత్తాసు పలుకుతూ వచ్చిన శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామీజీకి బిగ్ షాక్ తగిలింది.
ఈ దెబ్బతో మనోడు ఇక యాగాలు చేసేందుకు ముందుకు రాక పోవచ్చని సమాచారం. ఇదే సమయంలో సంచలన ప్రకటన చేసింది ఏపీ సర్కార్. అక్టోబర్ 31న దీపావళి పండుగను పురస్కరించుకుని మహిళలకు తీపి కబురు చెప్పింది. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది .
అంతే కాకుండా ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ చార్జీలను కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా ఎల్‌పీజీ కనెక్షన్ ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ స్కీమ్ వర్తింప చేస్తామని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
రూ.2,684 కోట్ల భారం పడుతున్నా 120 రోజుల్లోనే ఈ పథకం అమలు చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. మహిళల జీవన ప్రమాణాలను పెంచాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.