ఇంటర్ విద్యార్థులకు ఖుష్ కబర్
తీపి కబురు చెప్పిన నారా లోకేష్
అమరావతి – రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చదువుకుంటున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు విద్యార్థులందరికీ ఉచితంగా ప్రభుత్వం పుస్తకాలు, నోటు బుక్కులతో పాటు బ్యాగులు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఇవాళ కీలక ప్రకటన చేయడం విశేషం. రాష్ట్ర విద్యా శాఖ , ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్యార్థులు చదువు కునేందుకు తాము సాయం చేస్తామని ప్రకటించారు.
తాను విద్యా శాఖ మంత్రిగా కొలువు తీరాక దూకుడు పెంచారు. రాష్ట్రంలోని ప్రభుత్వ బడులు, కాలేజీలు, సాంకేతిక, ఇంజనీరింగ్ కాలేజీలన్నీ రాజకీయాలకు అతీతంగా ఉండాలని స్పష్టం చేశారు. విద్యా సంస్థలన్నీ సరస్వతీ నిలయాలుగా మారాలని , ఇందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విద్యా రంగం పరంగా ఏపీ దేశానికి ఆదర్శం కావాలని కోరారు నారా లోకేష్.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇంటర్ చదువుకుంటున్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.