Saturday, April 19, 2025
HomeNEWSANDHRA PRADESHక‌ర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు

క‌ర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు

క‌స‌ర‌త్తు ప్రారంభించిన ఏపీ స‌ర్కార్

అమ‌రావ‌తి – ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టికే సీఎం ప్ర‌క‌టించిన మేర‌కు క‌ర్నూలులో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేసేందుకు క‌స‌ర‌త్తు ప్రారంభించింది. భ‌వ‌నాల కోసం అన్వేష‌ణ ప్రారంభించారు. ఇదే స‌మ‌యంలో జిల్లా క‌లెక్ట‌ర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఈఆర్సీ, ఏపీ ఎస్పీ2వ బెటాలియ‌న్ భ‌వ‌నాల‌ను ప‌రిశీలించారు. ఇదిలా ఉండ‌గా గ‌త జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక వాటిని ప‌క్క‌న పెట్టింది.

విజ‌య‌వాడ రాష్ట్ర రాజ‌ధానిగా, విశాఖ‌, క‌ర్నూలు ప్రాంతాల‌ను ఎంపిక చేశారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. తెలుగుదేశం , జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ సంయుక్తంగా ఈసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో అద్భుత‌మైన విజ‌యాన్ని న‌మోదు చేశాయి. ఊహించ‌ని రీతిలో కొలువు తీరిన జ‌గ‌న్ రెడ్డికి షాక్ ఇచ్చింది కూట‌మి.

కేవ‌లం 11 సీట్ల‌కే ప‌రిమ‌త‌మైంది వైఎస్సార్సీపీ. సీఎంగా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు స్పీక‌ర్ గా చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు, ఉప స‌భాప‌తిగా ర‌ఘురామ కృష్ణం రాజును ఎంపిక చేశారు. కేబినెట్ తో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్లు, మెంబ‌ర్స్, డైరెక్ట‌ర్ల‌ను ఎంపిక చేశారు సీఎం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments