పెన్షనర్లకు ఏపీ సర్కార్ ఖుష్ కబర్
ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ
అమరావతి – ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లకు గుడ్ న్యూస్ ప్రకటించింది. ఒక రోజు ముందుగానే పెన్షన్లు అందజేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి పెన్షన్లను ఆగస్టు 31 రోజే పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రతి నెలా ఒకటో తారీఖునే పెన్షన్లు అందజేస్తామని ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. ఇందులో భాగంగా నెల నెలా పెన్షన్లు ఇస్తూ వచ్చారు.
అయితే ఆగస్టు నెలలో 31 రోజులు రావడంతో, సెప్టెంబర్ 1న ఆదివారం కావడంతో శనివారం రోజు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పెన్షన్లను ఒక రోజు ముందుగానే పెన్షనర్లందరికీ అందజేసేందుకు చర్యలు చేపట్టారు.
ఒకవేళ రాష్ట్రంలోని పెన్షనర్లు ఆగస్టు 31న గనుక పెన్షన్లు అందకపోతే సెప్టెంబర్ 2న సోమవారం రోజు పెన్షన్లు అందజేస్తామని వెల్లడించింది ఏపీ కూటమి ప్రభుత్వం. మొత్తంగా పెన్షనర్లకు సంతోషకరమైన వార్త చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.