NEWSANDHRA PRADESH

రిజిస్ట్రేష‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ల నిలిపేత

Share it with your family & friends

సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌ట‌న

అమ‌రావ‌తి – ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేష‌న్ సర్వీస్ సెంట‌ర్ల‌ను నిలిపి వేయాల‌ని ఆదేశించింది. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ ఉత్త‌ర్వులు జారీ చేవారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌చివాల‌యంలో ఏపీ రిజిస్ట్రేష‌న్ల శాఖ‌పై స‌మీక్ష చేప‌ట్టారు. గ‌తంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ గ్రామ, వార్డు స‌చివాల‌యాల‌లో అంద‌రికీ అందుబాటులో ఉండేలా రిజిస్ట్రేష‌న్లు చేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. దీని వ‌ల్ల పాల‌న పూర్తిగా పార‌దర్శ‌కంగా ఉంటుంద‌ని భావించారు.

కానీ చంద్ర‌బాబు నాయుడు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక దీనికి చెక్ పెట్టారు. వెంట‌నే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో రిజిస్ట్రేష‌న్లు నిలిపి వేయాల‌ని ఆదేశించారు. వ‌చ్చే మూడు నెల‌ల పాటు రిజిస్ట్రేష‌న్ల విలువ స‌మీక్షించాల‌ని ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. ఇందుకు సంబంధించి అప్ప‌టి వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ల‌ను నిలిపి వేయాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.