మహిళలకు బాబు దీపావళి కానుక
ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ
అమరావతి – ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు మహిళలకు. ఈ మేరకు గురువారం గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా వంటలు చేసే వారికి .
సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
ఇదే విషయాన్ని ఎన్డీయే శాసన సభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మహాశక్తి పథకం కింద పేదలకు ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు.. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసే పనిలో ఉందని ఈ సందర్బంగా వెల్లడించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
తాము ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తున్నామని ప్రకటించారు.