NEWSANDHRA PRADESH

17న ఏపీలో వాల్మీకి జ‌యంతి – లోకేష్

Share it with your family & friends

ప్ర‌క‌టించిన ఏపీ ప్ర‌భుత్వం

అమరావ‌తి – ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈమేర‌కు ఏపీ విద్యా , ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సూచ‌న‌ల మేర‌కు తాము వాల్మీకి జ‌యంతిని నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ప్ర‌క‌టించారు.

ఆదివారం నారా లోకేష్ ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన మరో హామీని చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చింద‌న్నారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి సోదరులు పాదయాత్రలో త‌న‌ను కలిసి విన్నవించారని తెలిపారు.

వారి సెంటిమెంటును గౌరవిస్తూ వాల్మీకి జయంతిని ఈనెల 17వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. అదేరోజు అనంతపురంలో రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతిని నిర్వహిస్తున్నామ‌ని పేర్కొన్నారు నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ బిసిల పుట్టినిల్లు. వారి ఆత్మ గౌరవాన్ని పెంచే దిశగా త‌మ‌ ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్ప‌ష్టం చేశారు.