ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
అమరావతి – ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయాంలో జగన్ ను , అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ మైనింగ్ సహా భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం) ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉండగా వైసీపీ పాలనా కాలంలో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో తనపై కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తను హైదరాబాద్ లో ఉండగా స్పెషల్ టీం వెళ్లింది. ముందస్తు నోటీసులు అందించింది. తన ఇంటికి అంటించిన వెంటనే తనను అదుపులోకి తీసుకుంది. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకుంది.
వల్లభనేని వంశీ అనేక అక్రమాలకు పాల్పడ్డాడని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేశాడని కేసులు నమోదయ్యాయి. కోర్టులో హాజరు పర్చడంతో 14 రోజుల రిమాండ్ విధించింది. విచారణకు సంబంధించి వంశీని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇంకా తీర్పు ఇవ్వలేదు. ఈ లోపు సిట్ ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది.