టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయం
తిరుమల – టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల రీత్యా ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో సీవీఎస్వోగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కేవీ మురళీకృష్ణను నియమించింది. ఈ విషయంలో సీఎం ఆదేశాల మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో తను తిరుమలలో పని చేశారు. ఆయనకు ఇక్కడ పని చేసిన అనుభవం ఉండడంతో తన వైపు మొగ్గు చూపింది. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. టీటీడీ సిఫారసు మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలా ఉండగా తను శాఖా పరంగా విశాఖలో శిక్షణ పొందుతున్నారు. ఆ వెంటనే రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ శ్రీనివాసుడి దయ వల్లనే మరోసారి పని చేసే అవకాశం తనకు దక్కిందన్నారు ఈ సందర్బంగా కేవీ మురళీకృష్ణ. ఇదిలా ఉండగా తిరుపతి వేదికగా జనవరి 8న తొక్కిసలాట చోటు చేసుకుంది. ఎనిమిది మంది భక్తులు చని పోగా 40 మంది గాయపడ్డారు. ఇదంతా భద్రతా వైఫల్యం వల్లనే జరిగిందని తేల్చారు. చివరకు విచారణకు ఆదేశించారు కూడా.
ఈ ఘటనకు సంబంధించి టీటీడీ సీవీఎస్వో శ్రీధర్ తో పాటు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడిని బదిలీ వేటు వేసింది. చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలుకు సవీఎస్వోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. తను ఇటు చిత్తూరు అటు తిరుమలకు బాధ్యతలు చేపట్టడం భారంగా మారింది. తిరుపతి ఎస్పీ హర్షవర్దన్ రాజుకు బాధ్యతలు ఇచ్చినా తనకు ప్రోటోకాల్ బాధ్యతలు ఉండడంతో తను కూడా ఫోకస్ పెట్టలేక పోతున్నారు. దీంతో సీవీఎస్వోగా కేవీ మురళీకృష్ణను నియమించింది టీటీడీ.