ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించింది ప్రభుత్వం. పూర్తిగా అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయ్ కుమార్ వెల్లడించారు. కాగా ఈ నెలాఖరులో ప్రస్తుతం డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమల రావు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో హరీష్ కుమార్ గుప్తాకే ప్రయారిటీ ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఇదిలా ఉండగా 1992కు చెందిన హరీష్ కుమార్ గుప్తాకు ఏపీ డిజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వాస్తవానికి, కొత్త డీజీపీ ఎంపిక రెండు వారాల క్రితమే ఖరారు అయింది.
ఏపీ డీజీపీ ఎవరిని నియమిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ద్వారకా తిరుమల రావు స్థానంలో ఎవరిని నియమిస్తారనే దానిపై తీవ్ర తర్జన భర్జనలు చోటు చేసుకున్నాయి. పూర్తిగా కసరత్తు చేసిన అనంతరం సీనియారిటీ ప్రాతిపదికన హరీష్ గుప్తా వైపే మొగ్గు చూపారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.