ఈవో మారినా భక్తుల కష్టాలు తీరేనా
టీటీడీ నూతన ఈవోగా జే శ్యామలా రావు
అమరావతి – రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రంగంలోకి దిగారు నారా చంద్రబాబు నాయుడు. ఆయన నమ్ముకున్న , కోట్లాది మంది భక్తులకు ఇలవేల్పుగా, కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడి శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పుణ్య క్షేత్రాన్ని ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు. ఆ మేరకు ఆయన శ్రీకారం కూడా చుట్టారు.
ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లారు. స్వామి , అమ్మ వార్లను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు. తిరుమల పుణ్య క్షేత్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడ ఓం నమో వేంకటేశాయ నమః అన్న స్మరణ తప్ప వేరే ఏ నినాదం వినిపించేందుకు వీలు లేదని హెచ్చరించారు. తిరుమలను భ్రష్టు పట్టించారంటూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆ వెంటనే పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. అనంతరం ఉన్నతాధికారుల పనితీరుపై సమీక్షించారు. ఆ వెంటనే టీటీడీ ఈవోపై వేటు వేశారు. పాలనా పరంగా విశేషమైన అనుభవం కలిగిన సీనియర్ ఐఏఎస్ జె శ్యామలా రావుకు ఈవోగా బాధ్యతలు అప్పగించారు.