Tuesday, April 22, 2025
HomeNEWSANDHRA PRADESHఅమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల‌కు ఆమోదం

అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల‌కు ఆమోదం

ఉత్త‌ర్వులు జారీ చేసిన ఏపీ ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి – ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది. అమరావతిలో చేపట్టాల్సిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగ‌ళ‌వారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీయే చేపడుతున్న 20 పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 20 సివిల్ పనులకు రూ.11,467 కోట్ల మేర ఖ‌ర్చు కానుంద‌ని స్ప‌ష్టం చేసింది.

కేంద్రం సహకారంతో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణాలతో ఈ పనులు చేపడుతున్నారు. ఈ నిధులతో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, జడ్జిల బంగ్లాలు, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లు, సెక్రటేరియట్ టవర్లు, మౌలిక సదుపాయాల నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశారు.

ఇక, రాజధాని ప్రాంతంలోని కొండవీటి వాగు, పాలవాగులను వెడల్పు చేసేందుకు కూడా నిధులు కేటాయించారు. శాఖమూరు, నీరుకొండ వద్ద రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.1.585 కోట్లు కేటాయించారు. హ్యాపీ నెస్ట్ అపార్ట్ మెంట్ల నిర్మాణం కోసం రూ.984 కోట్లు మంజూరు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments