NEWSANDHRA PRADESH

వైన్ షాపుల కోసం రుసుము ఖ‌రారు

Share it with your family & friends

ఫీజు కింద రూ. 2 ల‌క్ష‌లు నిర్ణ‌యం

అమరావ‌తి – ఏపీ ప్ర‌భుత్వం నూత‌న మ‌ద్యం పాల‌సీని తీసుకు వ‌చ్చింది. గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇందులో భాగంగా మ‌ద్యం షాపు పొందేందుకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా ఒక్కో షాపు ద‌ర‌ఖాస్తు రుసుమును నిర్ణ‌యించింది. రూ. 2 ల‌క్ష‌లు ఫీజుగా నిర్ణ‌యించిన‌ట్లు పేర్కొన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.

నిన్న జ‌రిగిన ఏపీ మంత్రివ‌ర్గం కీల‌క తీర్మానం చేసింది. ఓ వైపు మ‌ద్య నిషేధం చేస్తామ‌ని న‌మ్మించిన స‌ర్కార్ ఇప్పుడు మ‌ద్యం షాపుల‌కు లైన్ క్లియ‌ర్ చేసింది. ఈ మేర‌కు నూత‌న మ‌ద్యం పాల‌సీని తీసుకు వ‌చ్చింది.

నూతన మద్యం పాలసీలో భాగంగా 3,736 లిక్కర్ షాపుల్లో 10 శాతం (340) గీత కార్మికులకు రిజర్వ్ చేయ‌నున్న‌ట్లు పేర్కొంది ప్ర‌భుత్వం.

దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు కాగా లాటరీ విధానంలో రెండేళ్ల కాల పరిమితితో షాపులు కేటాయించ‌నున్నారు. ఈ షాపులకు స‌మ‌యం కూడా కేటాయించింది స‌ర్కార్. ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు తెరిచి ఉంచాల్సి ఉంటుంది.

ఒక‌వేళ నిర్దేశించిన స‌మ‌యానికంటే ముందే తెరిచినా లేదా ఆల‌స్యంగా మూసి ఉంచినా చ‌ర్య‌లు తప్ప‌వంటూ హెచ్చ‌రించింది ఏపీ కూట‌మి స‌ర్కార్.

అంతే కాకుండా జనాభా ఆధారంగా లైసెన్స్ ఫీజు కింద రూ. 50 నుంచి 85 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 12 ప్రధాన పట్టణాల్లో 12 ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు చేసేందుకు అనుమ‌తి ఇస్తారు.