DEVOTIONAL

స్వామీజీకి షాక్ సీఎం ఝ‌ల‌క్

Share it with your family & friends

శారదా పీఠానికి చెందిన స్థ‌లం ర‌ద్దు

అమ‌రావ‌తి – ఏపీలోని విశాఖ కేంద్రంగా నిర్వ‌హిస్తున్న శార‌దా పీఠానికి కోలుకోలేని రీతిలో ఝ‌ల‌క్ ఇచ్చారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అండ చూసుకుని రెచ్చి పోయారు స్వామి స్వ‌రూపానందేంద్ర స్వామీజీ. ఆయ‌న ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా త‌యారైంది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి, ఈవో మోక‌రిల్లింది. మాజీ టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డితో పాటు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి సైతం దండాలు పెట్టారు.

చివ‌ర‌కు రాజ‌కీయ అండ‌దండ‌లు ఉన్నాయ‌ని రెచ్చి పోయారు స్వామీజీ. శార‌దా మ‌ఠం పేరుతో అడ్డ‌గోలుగా ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను త‌క్కువ ధ‌ర‌కే పొందారు. దీనిని కొత్త‌గా కొలువు తీరిన కూట‌మి స‌ర్కార్ న‌జ‌ర్ పెట్టింది. చివ‌ర‌కు విచార‌ణ‌కు ఆదేశించింది. విచార‌ణ‌లో అక్ర‌మ‌మ‌ని తేలింది.

ఇందులో భాగంగా విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని శ్రీ శారదా పీఠానికి సర్వే నంబర్లు 102, 102/2 , 103లోని ప్రభుత్వ భూమి 15 ఎకరాలను ధారాదత్తం చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.

గత ప్రభుత్వంలో శారదా పీఠానికి 15 ఎకరాల విలువైన భూమిని ఇచ్చారు. ఈ భూముల వాస్తవ విలువ రూ.225 కోట్లు.. కానీ ఎకరానికి లక్ష చొప్పున రూ.15 లక్షలకు ఇస్తున్నట్లు 2021 నవంబరులో గత ప్రభుత్వం పలు జీఓలను విడుదల చేసింది.

పీఠానికి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఆ భూములను వాడు కోవాలన్నది వారి ఉద్దేశమని పాత జీవోను సవరించాలని తన వారసుడు అయిన స్వాత్మానందేంద్రతో కలిసి గత సీఎంకి లేఖ రాశారు.

సముద్ర తీరంలో వాణిజ్య, నివాస ప్రాంతాలకు కూడా భూములు కేటాయించాలని కోరారు. కానీ వేద విద్య వ్యాప్తికి, పీఠం కార్యకలాపాలకు అని ఆ జీఓలో రాశారు.. దీంతో ప్రభుత్వం ఈ భూ కేటాయింపులను రద్దు చేసింది.