14 నుండి పల్లె పండుగ – డిప్యూటీ సీఎం
ప్రగతికి అండగా ఉపాధికి తోడుగా
అమరావతి – ఏపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 14 నుండి రాష్ట్రమంతటా పల్లె పండుగ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించింది. పల్లె పండుగ ప్రగతికి అండగా ఉండేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపింది.
జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ. 4,500 కోట్ల ఖర్చుతో 30,000 పనులు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. రాష్ట్రంలోని 8 లక్షల మందికి 100 రోజుల పని కల్పించనున్నట్లు స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం.
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 3,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్లు బీటీ రోడ్డు, 25000 గోకులాలు,10,000 ఎకరాలలో నీటి సంరక్షణ ట్రించులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నమోదు చేసుకోని వారు కూడా ఇందులో భాగస్వామ్యం పాలు పంచుకోవచ్చని సూచించారు పవన్ కళ్యాణ్.
ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం.