రూ. 1500 కోట్లు విడుదల చేసిన కేంద్రం
అమరావతి – ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే ఢిల్లీలో పర్యటించడం వల్ల తాను అనుకున్నది సాధించు కోగలడంలో సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు. ప్రస్తుతం కేంద్ర సర్కార్ బీహార్, ఏపీ ప్రభుత్వాలపై ఆధార పడింది. దీంతో ఈ ఇద్దరు ఏది అడిగినా కాదనడం లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ సర్కార్.
ఏది ఏమైనా ఏపీకి భారీ ఎత్తున నిధులు మంజూరు చేయాలని కోరుతూ వస్తున్నారు. అంతే కాదు కేంద్ర కేబినెట్ లో తన వారికి కీలక పదవులు ఇప్పించు కోవడంలో కూడా సీఎం సక్సెస్ అయ్యారు. ఏపీ విభజన వల్ల భారీ ఎత్తున నష్టం జరిగిందని పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. అంతే కాదు తనకు చెందిన వారిని తెలంగాణలో తిష్ట వేసేలా ప్లాన్ చేశారు. అక్కడ కూడా సక్సెస్ అయ్యారు.
ఇదిలా ఉండగా ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఫలించింది. స్పెషల్ అసిస్టెంట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద తొలి విడతగా రూ 1500 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఈ సందర్బంగా ఏపీ ప్రభుత్వం మోడీకి, కేంద్ర సర్కార్ కు ధన్యవాదాలు తెలిపింది.