9 మంది డాక్టర్లను తొలగించిన సర్కార్
అమరావతి -ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. లోకాయుక్త ఆదేశాల మేరకు తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో 9 మంది వైద్యులను తొలగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది కాలం నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు లోకాయుక్తలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి సంచలన తీర్పు వెలువరించారు. వెంటనే విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యం వహించిన 55 మంది డాక్టర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు.
లోకాయుక్త ఆదేశాల మేరకు మొత్తం వైద్యులపై వేటు వేసింది సర్కార్. ఇదిలా ఉండగా తాజాగా తొలగించిన వైద్యులకు సంబంధించి తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో పని చేస్తున్న 9 మంది డాక్టర్లను తొలగిస్తూ చర్యలు తీసుకుంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పీడియాట్రిక్ గా పనిచేస్తున్న ఎం. వెంకట రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్థోపెడిక్ గా పని చేస్తున్న వి. సరస్వతి, బి. కిరణ్ కుమార్, కె. మధురిమ నాయుడును తొలగించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పీడియాట్రిక్ గా పని చేస్తున్న నళిని, అసిస్టెంట్ ప్రొఫెసర్ న్యూరాలజీ గా పని చేస్తున్న బి. చంద్రశేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ మెడిసన్ కె. లావణ్య , అసిస్టెంట్ ప్రొఫెసర్ రేడియో డయాగ్నసిస్ గా పనిచేస్తున్న ఎ. కార్తీక్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్డియాలజీ గా పని చేస్తున్న ఈ. శ్రీకాంత్ ను తొలగించింది.