ఏపీలో లక్షల మందికి పెన్షన్లు
65.92 రూ.1958.52 కోట్లు పంపిణీ చేసిన వాలంటీర్లు
అమరావతి – ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈసారి పెన్షన్లను పెంచారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా వాలంటీర్లు పంపిణీ చేయడంలో నిమగ్నం అయ్యారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెన్షన్లు పంపిణీకి శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమం కింద 65 లక్షల 92 వేల మందికి లబ్ది చేకూరనుంది. ఈ మేరకు మొత్తం రూ. 1958.52 కోట్లు విడుదల చేసింది. ఇవాళ తెల్లవారు జాము నుంచే ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉదయం 7 గంటల వరకే దాదాపు 12.70 శాతం పెన్షన్లు అందజేశారు.
ఇదిలా ఉండగా 8.37 లక్షల మందికి రూ. 247.51 కోట్లు పంపిణీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇవాళ బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. గ్రామ సచివాలయాలు , వార్డులు సైతం వాలంటీర్ల పంపిణీతో కళకళ లాడుతున్నాయి.
నవ రత్నాలలో భాగంగా పెన్షన్లు కీలకంగా మారాయి సర్కార్ కు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని భావిస్తున్నారు వైసీపీ బాస్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు. ఎన్నికలయ్యాక తెలుస్తుంది ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది.