Tuesday, April 22, 2025
HomeNEWSANDHRA PRADESHప‌ర్యాట‌క రంగానికి మ‌హ‌ర్ద‌శ

ప‌ర్యాట‌క రంగానికి మ‌హ‌ర్ద‌శ

స్ప‌ష్టం చేసిన కందుల దుర్గేష్

విజ‌య‌వాడ – రాష్ట్రంలో ప‌ర్యాట‌క రంగానికి పెద్ద‌పీట వేస్తున్నామ‌ని అన్నారు మంత్రి కందుల దుర్గేష్.
పర్యాటక రంగంలో పెట్టుబడులను రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేప‌ట్టింద‌న్నారు. పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు ఇస్తామ‌న్నారు.

గతంలో పర్యాటక రంగం నిర్విర్యమైందన్నారు. పర్యాటక రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు సరికొత్త పాలసీని తీసుకువచ్చామ‌ని చెప్పారు . పర్యాటక రంగంలో 25వేల కోట్ల పెట్టుబడులను తీసుకు రావడమే లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు.

పర్యాటక పాలసీ గురించి పెట్టుబడిదారులకు వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరామ‌న్నారు కందుల దుర్గేష్. పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

పరిశ్రమలకు ఇచ్చే ఇన్సెంటివ్ ల‌న్నీ పర్యాటక రంగం లో పెట్టే ప్రాజెక్టులకు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు కందుల దుర్గేష్. ప‌ర్యాట‌క రంగానికి పారిశ్రామిక హోదా క‌ల్పించిన ఘ‌న‌త త‌మ కూట‌మి స‌ర్కార్ కు ద‌క్కుతుంద‌న్నారు. రాష్ట్ర నలుమూలల్లో పర్యాటక రంగం అభివృద్ధి చేసేలా కార్యాచరణ అమలు చేస్తామ‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments