ఏపీలో భారీగా ఐఏఎస్ లకు స్థాన చలనం
సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరాక ఐఏఎస్ లు, ఎస్పీలను భారీ ఎత్తున బదిలీ చేస్తూ వస్తోంది. తమదైన ముద్ర కనబర్చేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా సమర్థవంతమైన అధికారులుగా పేరు పొందిన వారి జాబితాను తయారు చేసి పెట్టుకున్నారు.
ఈ మేరకు పలువురు ఐఏఎస్ లను మార్చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ముందుగా తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభించారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈవో ధర్మా రెడ్డిపై వేటు వేశారు. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జె. శ్యామల రావుకు బాధ్యతలు అప్పగించారు.
ఇదే సమయంలో జె. అనంతరాముకు కీలక పదవి అప్పగించారు. తాజాగా పలువురిపై బదిలీ వేటు వేశారు. వీరిలో మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సీహెచ్ శ్రీధర్.. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీగా ఎంవీ శేషగిరిబాబు.. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ కమిషనర్‌గా రేఖారాణిని నియమించారు.
ఇక ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌గా సీహెచ్ హరికిరణ్.. సెర్ప్ సీఈవోగా వీర పాండియ్యన్.. పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా హరినారాయణన్.. సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌గా శ్రీకేష్ బాలాజీరావు.. బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా మల్లికార్జునకు బాధ్యతలు అప్పగించారు.
ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ సెక్రటరీగా ప్రసన్న వెంకటేష్.. పౌర సరఫరాల కార్పొరేషన్ వీసీ ఎండీగా గిరీష.. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా కృతికా శుక్లా.. ఏపీ మార్క్ ఫెడ్ ఎండీగా జిలానీ సమూన్ ను నియమించారు.