జగన్ పత్రికకు రూ. 403 కోట్ల యాడ్స్
విచారణ జరిపిస్తామన్న ఏపీ సర్కార్
అమరావతి – ఏపీ కూటమి సర్కార్ సంచలన ప్రకటన చేసింది. శుక్రవారం శాసన సభలో జగన్ రెడ్డి తన పాలనా కాలంలో సీఎంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఏకంగా భార్య భారతీ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాక్షి పత్రికకు రూ. 403 కోట్లు యాడ్స్ రూపంలో కట్టబెట్టాడని ఆరోపించింది.
ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ రెడ్డి చేసిన మోసాన్ని తప్పు పట్టారు. వెంటనే ఏ ప్రాతిపదికన ఇన్ని కోట్లు కేటాయించారో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా కేవలం సాక్షికి ఇచ్చిన ప్రకటన ఖర్చు రూ. 403 కోట్లు ఉండగా మిగతా 20కి పైగా పత్రికలకు ఇచ్చిన ప్రకటనల ఖర్చు రూ. 488 కోట్లు అని స్పష్టం చేశారు మంత్రి.
సాక్షి పత్రికకు అడ్డంగా , సిగ్గు లేకుండా దోచి పెట్టడంపై హౌస్ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది సర్కార్. ఈ ప్రక్రియలో భాగమైన అధికారులను కూడా విచారిస్తామని, వారిని రిలీవ్ చేయకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
ఈ మొత్తం వ్యవహారం అసెంబ్లీలో తీవ్ర చర్చకు దారి తీసేలా చేసింది. మొత్తంగా కొత్త సర్కార్ రాకతో జగన్ రెడ్డి చేసిన దారుణాలు, దోచుకున్న వాటిపై విచారణకు ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.