ఆదేశించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి – తిరుపతిలో చోటు చేసుకున్న వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల జారీ ఘటనకు సంబంధించి న్యాయ విచారణకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. జ్యుడీషియల్ ఎంక్వైరీకి రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది సర్కార్.
ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. 32 మందికి పైగా గాయపడ్డారు. వారికి నేరుగా స్వామి వారిని దర్శించుకునే భాగ్యాన్ని కల్పించింది. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.
ఘటన జరిగిన వెంటనే తీవ్రంగా స్పందించారు సీఎం, డిప్యూటీ సీఎం. పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి టీటీడీ పాలక మండలిపై. చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయని అందుకే ఈ ఘటన చోటు చేసుకుందని విమర్శలు వచ్చాయి. చివరకు సీఎం ముందే ఈవో, చైర్మన్ వాగ్వాదం జరగడం చర్చనీయాంశంగా మారింది.