ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన సర్కార్
అమరావతి – బియ్యం అక్రమ రవాణాపై ఏర్పాటైన సిట్‌లో కీలక మార్పులు చేసింది ఏపీ కూటమి ప్రభుత్వం. సీఐడీ ఐజీ వినిత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. గతంలో నియమించిన నలుగురు డీఎస్పీలపై అభ్యంతరాలు రావడంతో మరో నలుగురు సభ్యులను ఏర్పాటు చేసింది. దీనిపై సీఎస్ కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలా ఉండగా గత వైఎస్సార్సీపీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ప్రజలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం పక్కదారి పట్టినట్లు గుర్తించింది కొత్త సర్కార్. దీనిపై పూర్తిగా విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు స్వయంగా రంగంలోకి దిగారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
ఈ మేరకు మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కేసు నమోదు చేశారు. తమకు సంబంధించిన గో డౌన్ లో 4 వేల టన్నులకు పైగా బియ్యం మాయమైనట్లు ఆరోపించారు. వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించడంతో పేర్నినాని హైకోర్టును ఆశ్రయించారు.