సంజయ్ ను విచారించేందుకు సర్కార్ ఓకే
ఏసీబీ వినతికి జీఏడీ అనుమతి
అమరావతి – సీనియర్ ఐపీఎస్ ఎన్. సంజయ్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఫైర్ డీజీ, సీఐడీ ఏడీగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్‍ఫోర్స్ మెంట్ విభాగం నివేదిక సమర్పించింది. సాక్ష్యాధారాలను సమర్పించడంతో సంజయ్ ను సస్పెండ్ చేసింది.
విజిలెన్స్ నివేదికను ఏసీబీకి పంపి విచారణ చేపట్టాలని ఆదేశించింది. అవినీతి నిరోధక చట్టం కింద విచారించేందుకు పర్మిషన్ ఇవ్వలని సీఎస్ కు లేఖ రాసింది. ఏసీబీ విజ్ఞప్తిని పరిశీలించి సంజయ్ ప్రాసిక్యూషన్‍కు జీఏడీ అనుమతి.
గతంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు ఇతర వైసీపీ నేతలకు వంత పాడారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసే వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు విమర్శలు ఉన్నాయి.
ఎవరూ ఊహించని రీతిలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్కార్ పవర్ లోకి వచ్చింది. దీంతో ఆనాటి సర్కార్ కు వంత పాడిన వాళ్లు, మద్దతుగా నిలిచిన ఐపీఎస్ఎలు, ఐఏఎస్ లకు కోలుకోలేని షాక్ ఇస్తూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు .