NEWSANDHRA PRADESH

పింఛ‌న్ల పంపిణీపై కీల‌క ఆదేశాలు

Share it with your family & friends

గ్రామ..వార్డు స‌చివాల‌య ఉద్యోగులు

అమ‌రావ‌తి – రాష్ట్రంలో కొలువు తీరిన కొత్త ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో వాలంటీర్లు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే వారు. కానీ తాజాగా పెన్ష‌న్లు పంపిణీకి సంబంధించి ప‌లు సూచ‌న‌లు చేసింది.

పింఛన్ల నగదును నేరుగా ఇంటి వద్దకే వచ్చి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేస్తారని ప్ర‌క‌టించింది రాష్ట్ర ప్ర‌భుత్వం.

పింఛన్ల పంపిణీకి సగటున ప్రతి గ్రామం, వార్డు సచివాలయ ఉద్యోగి 50 మంది లబ్దిదారులకు మించకుండా కేటాయించడం జ‌రిగింద‌ని పేర్కొంది. కాగా పింఛన్ల పంపిణీకి అవసరమైన సంఖ్యలో గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేని చోట ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించు కోవాల‌ని స్ప‌ష్టం చేసింది ఏపీ స‌ర్కార్.

ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు పెన్ష‌న్లు పూర్త‌య్యేంత దాకా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.