రెడ్ జోన్..సర్వే లెన్స్ జోన్ లు
అమరావతి – ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. పెద్ద ఎత్తున కోళ్లు చని పోతుండడంతో చర్యలు చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో రెడ్ జోన్, సర్వే లెన్స్ జోన్ లను ఏర్పాటు చేసింది. వైరస్ చని పోతున్న కోళ్లకు బర్డ్ ఫ్లూగా నిర్దారించారు. పూణె ల్యాబ్ లో పరీక్షించారు. రాజమండ్రి కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. కోళ్ల అమ్మకాలపై నిషేధం విధించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా ఇబ్బందులు ఉంటే 95429 08025 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు కలెక్టర్.
ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాతకు గురయ్యాయి. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంపీడీఓలతో మాట్లాడారు. కొంత కాలం పాటు కోళ్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
బర్డ్స్ ఎక్కడ చనిపోతున్న పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలని స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ప్రజలు కొన్ని రోజులు పాటు చికెన్ తినడం తగ్గించాలని సూచించారు.
ఇటీవల నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో లక్షలాది కోళ్ళు మృత్యువాత పడ్డాయి. ఒక్కో పౌల్ట్రీ ఫాం లో రోజుకు 10 వేలకు పైగా మృతి చెందుతున్నాయి.
కానూరు శాంపిల్స్ కు ల్యాబ్ రిపోర్ట్ రావడంతో సంబంధిత శాఖలతో అత్యవసర సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్. ఈ పరిధిలో 144, 133 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.