సీఎం చంద్రబాబు తొలి సంతకం
అమరావతి – ఏపీ కూటమి సర్కార్ పేదల అభ్యున్నతి కోసం పాటు పడుతుందని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. పేదలకు లబ్ది చేకూర్చేలా సీఎంఆర్ఎఫ్ నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. దీని వల్ల 1,600 మందికి రూ. 24 కోట్ల మేర నిధులు అందుతాయని అన్నారు. ఇప్పటి వరకు రూ. 100 కోట్లకు పైగా నిధులను పేద వర్గాలకు మంజూరు చేశామని, 7,523 మందికి లబ్ది చేకూరిందన్నారు.
9,123 మందికి రూ. 124.16 కోట్లు ఇవ్వడం జరిగిందని చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. కాగా గత ఐదేళ్ల వైసీపీ జగన్ రెడ్డి కాలంలో ఏపీని పట్టించు కోలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వాపోయారు.
కానీ తాము వచ్చాక అభివృద్ది, సంక్షేమం రెండింటికి సమ ప్రాధాన్యత ఇచ్చామన్నారు సీఎం. దీని కారణంగా అన్ని వర్గాలకు ప్రజలకు మేలు చేకూరుతోందన్నారు. వ్యవస్థలను బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు నారా చంద్రబాబు నాయుడు.