15 వేల మందికి షోకాజ్ నోటీసులు
జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి – ఏపీ కూటమి సర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. బయో మెట్రిక్ కచ్చితంగా అనుసరించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయినా పట్టించుకోక పోవడంతో ఝలక్ ఇచ్చింది.
ఈ మేరకు ఏకంగా 15,000 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బయో మెట్రిక్ వేయని సచివాలయ సిబ్బందికి మెమోలు జారీ చేసింది.
గ్రామ వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు విధిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని ఇప్పటికే స్పష్టం చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. అయితే 13 రోజులు పాటు వారు వరుసగా బయోమెట్రిక్ వేయక పోవడంతో ప్రభుత్వం వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది..
ఇదిలా ఉండగా గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయంలో సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించింది. ప్రస్తుతం సర్కార్ షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో బెంబేలెత్తి పోతున్నారు సిబ్బంది.