ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
అమరావతి – ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఐసీడీఎస్ పీడీలపై సస్పెన్షన్ వేటు వేసింది. పీడీలు ఎస్.సువర్ణ, జి. ఉమాదేవీ లు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల విభజన తర్వాత ఇద్దరు పీడీల మధ్య కార్యాలయానికి సంబంధించి వివాదం చోటు చేసుకుంది. వేర్వేరుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించినా పట్టించుకోలేదు. దీంతో చర్యలు చేపట్టింది.
ఇదిలా ఉండగా కృష్ణా జిల్లా కానూరులోని ఉమ్మడి కృష్ణా జిల్లా ఐసీడీఎస్ కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు ఇద్దరు పిడీలు సువర్ణ, ఉమాదేవి. జిల్లాల విభజన తరువాత ఇద్దరూ పిడిల మద్య పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకుంది.
వేరు వేరుగా రెండు జిల్లాల కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది..నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోలేదు. పంతానికి పోయారు. తమ పట్టు వీడలేదు.
ఇదే విషయంపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇచ్చిన ఆదేశాలను సైతం బేఖాతర్ చేశారు పీడీలు. సర్కార్ ఇచ్చిన ఆదేశాలు ధిక్కరించినందుకు సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు వారిద్దరిపై వేటు వేసింది.