ఏపీలో ఎస్పీలకు స్థాన చలనం
ఆ పదహారు మందికి నో ఛాన్స్
అమరావతి – రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పలువురిపై బదిలీ వేటు పడుతోంది. ఇప్పటికే ఐఏఎస్ లు, ఐపీఎస్ లకు స్థాన చలనం కలుగుతోంది. తాజాగా డీజీపీగా కొలువు తీరిన ద్వారకా తిరుమల రావు తనదైన మార్క్ కు శ్రీకారం చుట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ లు 16 మందిని పక్కన పెట్టారు. అంతే కాకుండా తప్పనిసరిగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం దాకా హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని స్పష్టం చేశారు. విచిత్రం ఏమిటంటే సదరు అధికారులకు మెమోలు కూడా జారీ చేయడం కలకలం రేపింది.
ఇది పక్కన పెడితే పలువురు ఐపీఎస్ లను బదిలీ చేశారు డీజీపీ ద్వారకా తిరుమల రావు. ఈ మేరకు ఇవాళ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 10 మంది ఐపీఎస్ లను బదిలీ చేశారు. సత్య ఏసు బాబును డీజీపీ ఆఫీసుకు బదిలీ చేసింది. గ్రే హౌండ్స్ గ్రూప్ కమాండర్ గా సుమిత్ మిట్టల్ ను నియమించారు.
అనంతపురం ఎస్పీగా జగదీశ్ , విశాఖ ఏపీఎస్పీ కమాండెంట్ గా మురళీ కృష్ణ, విజయవాడ డీసీపీగా మహేశ్వర రాజు, గుంతకల్ రైల్వే ఎస్పీగా రాహుల్ మీనా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్, చిత్తూరు ఏఎస్పీగా పంకజ్ కుమార్ మీనా, పార్వతీపురం ఎస్డీపీఓగా సురాన్ అంకిత్ కు బాధ్యతలు అప్పగించారు.