NEWSANDHRA PRADESH

ఏపీలో ఐఏఎస్ ల‌కు స్థాన చ‌ల‌నం

Share it with your family & friends

టీటీడీ జేఈవోగా గౌత‌మి నియామ‌కం

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌స్తుతం శాస‌న స‌భ‌, లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటోంది రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం. ఇప్ప‌టికే ఓట‌ర్ల న‌మోదు కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. కొత్త‌గా భారీ ఎత్తున ఓట‌ర్లుగా న‌మోదు చేసుకుంటున్నారు. ఇదే స‌మ‌యంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ప‌లువురు సీనియ‌ర్ ఐఏఎస్ ల‌ను మార్చేసింది. సుదీర్ఘ కాలం పాటు ఉన్న వారికి షాక్ ఇచ్చింది.

విచిత్రం ఏమిటంటే టీటీడీ ఈవోగా కొన్నేళ్లుగా ఉన్న‌ప్ప‌టికీ ఏవీ ధ‌ర్మా రెడ్డిని మాత్రం అలాగే ఉంచి జేఈవోగా ఉన్న వీర బ్ర‌హ్మంను మార్చ‌డం ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఇది ప‌క్క‌న పెడితే ఎన్నిక‌ల‌తో సంబంధం లేని శాఖ‌ల‌కు పోస్టింగ్ ఇస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఏపీ ఆరోగ్యశ్రీ ట్రస్టు CEOగా లక్ష్మీ షాను నియ‌మించింది స‌ర్కార్. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా రాజాబాబు, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి జేఈవోగా గౌత‌మి, మ‌ధ్యాహ్న భోజ‌నం ప‌థ‌కం డైరెక్ట‌ర్ గా అంబేద్క‌ర్ , పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీగా వెంకట్రామిరెడ్డి, సీసీఎల్ ఏ కార్య‌ద‌ర్శిగా ప్ర‌భాక‌ర్ రెడ్డిని నియ‌మించింది.