ఏపీలో ఐఏఎస్ లకు స్థాన చలనం
ఆదేశాలు జారీ చేసిన సీఎస్ జవహర్ రెడ్డి
అమరావతి – ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాలలో ఉన్న పలువురు ఉన్నతాధికారులను వెంటనే మార్చాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. త్వరలో ఏపీలో శాసన సభతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ తరుణంలో ఉన్నట్టుండి పలువురు ఐఏఎస్ లను బదిలీ చేసింది ప్రభుత్వం. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పలువురిపై బదిలీ వేటు వేశారు. బుధవారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా సుమిత్ కుమార్ ను నియమించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా పి. ప్రశాంతి బదిలీ అయ్యారు. అల్లూరి సీతారామ రాజు జిల్లా కలెక్టర్ గా ఎం. విజయ సునీతను నియమించారు సీఎస్ జవహర్ రెడ్డి.
అంతే కాకుండా జి. వీర పాండ్యన్ ను పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. విచిత్రం ఏమిటంటే ఐఎఫ్ఎస్ అధికారి రాహుల్ పాండేను జీఏడీలో రిపోర్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.