ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు
శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు
అమరావతి – రాష్ట్రంలో భారీ ఎత్తున ఐఏఎస్ లకు స్థాన చలనం కలిగింది. ప్రభుత్వం మారడంతో ముందు నుంచీ తమపై బదిలీ వేటు తప్పదని ఇప్పటికే కొందరు ఉన్నతాధికారులు డిసైడ్ అయ్యారు. గతంలో తమ పట్ల వ్యవహరించిన వారిని పనిగట్టుకుని గుర్తు పెట్టుకున్నారు బాబుతో పాటు పవన్ కళ్యాణ్. ఇక ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే ఏకంగా రెడ్ బుక్ లో రాసుకున్నారు.
ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ లపై కూడా ఫోకస్ పెట్టారు కొత్తగా కొలువు తీరిన సీఎం చంద్రబాబు నాయుడు. గత వైసీపీ సర్కార్ లో చక్రం తిప్పిన వారికి బిగ్ షాక్ ఇచ్చారు. ఇందులో భాగంగా శ్రీలక్ష్మీ, రజిత్ భార్గవ్ , ద్వివేదిలకు ఎలాంటి పోస్టులు ఇవ్వలేదు.
వారిని జేఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. ఇక బదిలీ అయిన వారిలో జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్గా జి సాయిప్రసాద్, పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శిగా శశి భూషణ్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్ ను నియమించారు.
కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణా ద్వివేది, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అనిల్కుమార్ సింఘాల్..పౌర సరఫరాల శాఖ కమిషనర్గా సిద్ధార్థ్ జైన్, పాఠశాల కార్యదర్శిగా కోన శశిధర్, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, సీఆర్డీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్, సీఎం కార్యదర్శిగా ప్రద్యుమ్నను నియమించారు.