ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య
అమరావతి – నామినేటెడ్ పదవులకు సంబంధించి తుది నిర్ణయం సీఎం చంద్రబాబు నాయుడిదే నని స్పష్టం చేశారు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. ఎమ్మెల్యేలు చేసిన సిఫారసుల మేరకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రజా మన్ననలు తమ సర్కార్ పొందుతోందన్నారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. భారీ పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు సీఎం, లోకేష్ దావోస్ కు వెళ్లారని అన్నారు.
కాకాని నగర్ కార్యాలయంలో నందిగామ నియోజకవర్గం ముఖ్య నేతలతో సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు తంగిరాల సౌమ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటన సాగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని అన్నారు. ఈ పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పారు.
టీడీపీ సభ్యత్వ నమోదులో కార్యకర్తలకు ఉచిత బీమా పాలసి అందించిన ఘనత మంత్రి లోకేష్ కే దక్కుతుందన్నారు. త్వరలో నే రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలులోకి వస్తుందన్నారు.