NEWSANDHRA PRADESH

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టు ఊర‌ట

Share it with your family & friends

బెయిల్ మంజూరు చేసిన ధ‌ర్మాస‌నం

అమ‌రావ‌తి – రాష్ట్రంలో తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈవీఎంల ధ్వంసం చేసిన ఘ‌ట‌న‌కు సంబంధించి దేశ వ్యాప్తంగా సంచ‌లనంగా మారారు వైసీపీకి చెందిన మాచ‌ర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణా రెడ్డి.

ఆయ‌న‌పై ఎన్నిక‌ల సంఘం కేసు న‌మోదు చేసింది. దీంతో ముందు జాగ్ర‌త్త‌గా త‌న‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టును ఆశ్ర‌యించారు. శుక్ర‌వారం మాజీ ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి విచార‌ణ చేప‌ట్టింది రాష్ట్ర హైకోర్టు.

విచిత్రం ఏమిటంటే ఈవీఎం కేసుతో పాటు మ‌రో రెండు కేసులు మాజీ ఎమ్మెల్యేపై న‌మోదై ఉన్నాయి. రెండు కేసుల‌కు సంబంధించి ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇదిలా ఉండ‌గా పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి చెందిన పాస్ పోర్టును వెంట‌నే అప్ప‌గించాల‌ని ఆదేశించింది హైకోర్టు.

కాగా గ‌త జూన్ 26న పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 59 రోజుల త‌ర్వాత ఆయ‌న జైలులోనే ఉన్నారు. ప్ర‌స్తుతం నెల్లూరు సెంట్ర‌ల్ జైలులో ఉన్నారు. కోర్టు ఆదేశాల‌తో ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చే ఛాన్స్ ఉంది.