డైరెక్టర్ పై తొందరపాటు తగదు
అమరావతి – వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్ లభించింది. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్జీవీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ సీఐడీకి ఆదేశించింది. విచారణకు రావాలంటూ దర్శకుడికి నోటీసులు జారీ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. తాను ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నానని, తనపై కావాలని కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందంటూ ఆరోపించారు. సీఐడీ దూకుడు తగ్గిస్తే మంచిదని సూచించింది హైకోర్టు.
ఇదిలా ఉండగా గత జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రామ్ గోపాల్ వర్మ రెచ్చి పోయారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ లను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనపై పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. తన భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికను ఆధారంగా చేసుకుని కేసులు ఎలా నమోదు చేస్తారంటూ ప్రశ్నించారు. అలా కేసులు నమోదు చేసుకుంటూ పోతే జైళ్లు నిండవని పేర్కొన్నారు.