హైకోర్టులో మాజీ మంత్రికి ఊరట
అమరావతి – మాజీ మంత్రి పేర్ని నానికి భారీ ఊరట లభించింది. రేషన్ బియ్యం మాయం కేసులో తనను అక్రమంగా ఇరికించారంటూ , తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులను ఆదేశించారు. ఈ కేసులో పేర్ని నానిని ఏ6గా చేర్చారు. ఇదే కేసులో పేర్ని నాని భార్య జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరైంది.
ఏ1 గా భార్యను చేర్చారు పోలీసులు. మంత్రిగా పేర్ని నాని ఉన్న సమయంలో తన భార్యకు సంబంధించిన గో డౌన్ లో ఏకంగా ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ బియ్యం 4 వేల క్వింటాళ్లకు పైగా మాయమైనట్లు ప్రభుత్వం ఆరోపించింది.
దీనిపై విచారణకు ఆదేశించారు మంత్రి నాదెండ్ల మనోహర్. విచారణకు సంబంధించి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని పేర్కొన్నారు. గత నెల రోజులుగా కనిపించకుండా పోయారు మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం. తమను అరెస్ట్ చేయొద్దంటూ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారించిన కోర్టు సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశించింది.