NEWSANDHRA PRADESH

మాజీ ఎమ్మెల్యే వంశీకి కోర్టు ఊర‌ట‌

Share it with your family & friends

ఆగ‌స్టు 20 వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దు

అమరావ‌తి – వైసీపీకి చెందిన గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి భారీ ఊర‌ట ల‌భించింది. త‌న‌కు ముంద‌స్తు బెయిల్ కావాల‌ని కోరుతూ అమ‌రావ‌తి రాష్ట్ర కోర్టును ఆశ్ర‌యించారు. బుధ‌వారం ఈ బెయిల్ కేసుకు సంబంధించి కోర్టు విచార‌ణ చేప‌ట్టింది.

సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని అరెస్ట్ చేయొద్దంటూ స్పష్టం చేసింది. ఆగ‌స్టు 20వ తేదీ వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని ఆదేశించింది. ముంద‌స్తుగా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది.

ఇదిలా ఉండ‌గా ఏపీలో ప్ర‌భుత్వం మారింది. నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరింది. దీంతో త‌మ‌పై కేసులు న‌మోదు చేసిన వారిని టార్గెట్ చేసింది. అంతే కాకుండా గ‌న్న‌వ‌రం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి జ‌రిగింది గ‌తంలో.

ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన పాత్ర మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి ఉంద‌ని టీడీపీ ఆరోపించింది. ఈ మేర‌కు కేసు న‌మోదైంది. ప‌లువురిని అదుపులోకి తీసుకుంది. ఇదిలా ఉండ‌గా హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు వ‌స్తుండ‌గా వంశీని అదుపులోకి తీసుకున్నారు.

త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని వంశీ పేర్కొన్నారు. వ్యూహాత్మ‌కంగా ముంద‌స్తు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. దీంతో 20 వ‌ర‌కు ఊపిరి పీల్చుకునే ఛాన్స్ ద‌క్కింది వంశీకి.