చంద్రబాబుకు హైకోర్టు షాక్
ధర్మాసనం కీలక తీర్పు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఉన్నట్టుండి పవర్ లోకి రావాలని కలలు కంటున్న మాజీ సీఎం , టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం. బుధవారం బాబు ఏపీని పాలించిన సమయంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్ -1 పరీక్ష చేపట్టారు. దీనిలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ పరీక్షలు రాసిన అభ్యర్థులను కోర్టు మెట్లు ఎక్కారు.
చంద్రబాబు నాయుడు పవర్ లోంచి దిగి పోయి 5 ఏళ్లవుతోంది. అయినా ఇన్నేళ్లకు ఇప్పుడు హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది ఈ కేసుకు సంబంధించి. ఆయన హయాంలో నిర్వహించిన గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు తీర్పు చెప్పింది.
విచారణ సందర్భంగా బాధితుల తరపున లాయర్ జవాబు పత్రాలను రెండు సార్లు మూల్యాంకనం చేశారంటూ కోర్టుకు విన్నవించారు. తొలిసారి దిద్దగా వచ్చిన రిజల్ట్స్ ను పక్కన పెట్టారని వాపోయారు. అయితే రెండోసారి దిద్దించారని, నచ్చిన వారిని ఎంపిక చేశారని, ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించారని ఆరోపించారు. దీనిపై పూర్తిగా విచారణ చేపట్టిన కోర్టు షాక్ ఇస్తూ తీర్పు చెప్పింది. పరీక్షలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.