బిగ్ రిలీఫ్ ఇచ్చిన ఏపీ హైకోర్టు
మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ రిలీఫ్ లభించింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు తనను ఎ6గా చేర్చారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు పేర్ని నాని. ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. తనను ఇబ్బంది పెట్టేందుకు అక్రమ కేసు బనాయించిందని అన్నారు. బియ్యం ఎవరు మెక్కుతున్నారో ప్రజలకు తెలుసన్నారు.
గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణకు ఆదేశించింది సర్కార్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ తో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల ఆధ్వర్యంలో పలుమార్లు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకు, దేశాలకు తరలిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డిని చూసుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలో మంత్రులుగా పని చేసిన వారంతా అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించారు.
ఇప్పటికే నారా లోకేష్ రెడ్ బుక్ రాశానని ప్రకటించారు. ఇందులో నమోదు చేసిన పేర్లలో ఉన్న వారందరికీ నోటీసులు పంపిస్తున్నారు పోలీసులు.