వాహనదారులకు హైకోర్టు బిగ్ షాక్
విద్యుత్..నీళ్ల కనెక్షన్లు కట్ చేయండి
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. ట్రాఫిక్ చలాన్ కట్టక పోతే ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా ఆపేయాలని ఆదేశించింది. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్లగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని మండి పడింది.
పోలీసులు, అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచి పద్దతి కాదని పేర్కొంది. ప్రధానంగా ఏపీలో హెల్మెట్ ధరించక పోవడం వల్ల గత మూడు నెలల కాలంలో 667 మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది హైకోర్టు.
నిబంధనలు సరిగ్గా అమలు చేయక పోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయంటూ పిటిషన్ దాఖలైంది. ఈ దావాపై గురువారం విచారణ చేపట్టింది ధర్మాసనం. ఎందుకు పట్టించు కోవడం లేదంటూ సీరియస్ అయ్యింది. ఓ వైపు ప్రాణాలు పోతుంటే ఎందుకు ఫోకస్ పెట్టడం లేదని పేర్కొంది.