Monday, April 21, 2025
HomeNEWSANDHRA PRADESHనేర నియంత్ర‌ణపై ఫోక‌స్

నేర నియంత్ర‌ణపై ఫోక‌స్

మంత్రి వంగ‌ల‌పూడి అనిత

అమరావతి – రాష్ట్రంలో నేర నియంత్ర‌ణ‌పై దృష్టి సారిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. కేంద్ర ప్ర‌భుత్వ నిధుల‌తో పోలీస్ శాఖ అభివృద్దికి బాట‌లు వేస్తామ‌న్నారు. పోలీస్, అగ్నిమాపక సేవలు, జైళ్లు, విపత్తు నిర్వహణ, జిల్లా సైనిక సంక్షేమానికి సంబంధించిన కేంద్ర పథకాల నిధులు రాబట్టడంపై కూటమి ప్రభుత్వం ఫోక‌స్ పెట్టింద‌న్నారు.

కేంద్ర హోంశాఖ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడైన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో కలిసి సోమవారం రాష్ట్ర సచివాలయంలో హోం, విపత్తు నిర్వహణ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. టెక్నాలజీ పెరుగుతూ నిరంతరం నేర స్వరూపం మార్చుకుంటోన్న నేపథ్యంలో పోలీసులకు తగిన సదుపాయాలు, శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై సమాలోచనలు జరిపినట్లు హోంమంత్రి తెలిపారు. అందులో భాగంగా సాంకేతికతతో కూడిన గ్రేహౌండ్స్, ఆక్టోపస్,సైబర్ సెక్యూరిటీ వంటి కీలక సంస్థలను నెలకొల్పేందుకు కృషి చేస్తామన్నారు.

కేంద్ర నిధులు, పోలీస్ శిక్షణ సంస్థలు రాబట్టడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింద‌న్నారు.
నిధులు సేకరించడం, పోలీసులకు కనీస సదుపాయాలు కల్పించడంపై గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీసం దృష్టి పెట్టలేదని వంగలపూడి అనిత విమర్శించారు.

ఏపీ పోలీస్ అకాడమీ (అప్పా)కు సంబంధించి కూటమి ప్రభుత్వంలో వేగంగా అడుగులు పడుతున్నాయని హోంమంత్రి అన్నారు. శాశ్వత భవనాలు నిర్మించేందుకు వీలుగా స్థల సేకరణ ప్రక్రియను పూర్తి చేశామన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments