శ్రీవారిని దర్శించుకున్న హోం మంత్రి
శ్రీకల్కి వేంకటేశ్వర ఆలయంపై వినతిపత్రం
తిరుమల – తిరుమలలో కొలువై ఉన్న కలియుగ దైవంగా భావించే ఆ దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయంలోకి వెళ్లిన హోంమంత్రికి టిటిడి అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వదించారు. టీటీడీ అధికారులు శేష వస్త్రం కప్పి స్వామి వారి తీర్థ ప్రసాదాలను హోంమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు.
కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా టీటీడీ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నిబద్దత కలిగిన వారిని టీటీడీ పాలక మండలిలో నియమించడం జరిగిందన్నారు వంగలపూడి అనిత.