DEVOTIONAL

దుర్గ‌మ్మ స‌న్నిధిలో హోం మంత్రి

Share it with your family & friends

ద‌ర్శించుకున్న డిప్యూటీ సీఎం

విజ‌య‌వాడ – ఇంద్రకీలాద్రిపై మూలా నక్షత్ర శుభ ముహూర్తాన సరస్వతీ దేవి అలంకారంలో కొలువు తీరిన కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ఆమెతో పాటు కూతురు, కుటుంబీకులు పూజ‌లు చేశారు.

ఇదే స‌మ‌యంలో ఇక్క‌డికి విచ్చేసిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు వంగ‌ల‌పూడి అనిత‌. వేదపండితుల ఆశీర్వాదాలతో పాటు మర్యాద పూర్వకంగా అమ్మ వారి చిత్రపటాన్ని బహూకరించడం జరిగింది.

ఎంపీ కేశినేని చిన్ని కూడా అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆ సరస్వతీ దేవి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదిలా ఉండ‌గా న‌వ‌రాత్రి ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ శ్రీ క‌న‌క దుర్గమ్మ అమ్మ వారు స‌ర‌స్వ‌తీ రూపంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు అమ్మ వారి ఆశీర్వాదం పొందేందుకు.

ఇదిలా ఉండ‌గా మూలా న‌క్ష‌త్రంలో శ్రీ క‌న‌క దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకుంటే స‌క‌ల శుభాలు క‌లుగుతాయ‌ని ప్ర‌గాఢ న‌మ్మ‌కం భ‌క్తుల‌కు. వేద పండితులు పూజ‌లు జ‌రిపించారు. అమ్మ వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం వంగ‌ల‌పూడి అనిత‌కు ప్ర‌సాదం, అమ్మ వారి చిత్ర ప‌టాన్ని బ‌హూక‌రించారు.