సర్ ప్రైజ్ ఇచ్చిన హోం మంత్రి
వైజాగ్ దమ్ టీ స్టాల్ సందర్శన
విశాఖపట్నం – ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సర్ ప్రైజ్ ఇచ్చారు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో ఉన్న ఫేమస్ వైజాగ్’స్ దమ్ టీ స్టాల్ ని విజిట్ చేశారు. ఇక్కడ చాయ్ బాగుంటుందంటూ తనతో చాలా మంది చెప్పారని అన్నారు.
నిర్వాహకులను ఆప్యాయంగా పలకరించారు. కంచు పాత్రలో చిన్న కుండలో ప్రత్యేకంగా చేసే టీ తయారీ విధానాన్ని పరిశీలించారు. అనుకోకుండా వచ్చిన అనితకు ధన్యవాదాలు తెలిపారు టీ యజమానులు.
మంత్రిగా ఫుల్ బిజీగా ఉన్నారు వంగలపూడి అనిత. కంచు పాత్రలో చిన్న కుండలో ప్రత్యేకంగా చేసే ‘టీ’ తయారీ విధానం బాగుందంటూ కితాబు ఇచ్చారు. ప్రత్యేకించి నిర్వాహకులను ప్రశంసించారు. అందరూ చాయ్ తాగుతారని, కానీ కొందరు మాత్రమే రుచికరంగా తయారు చేస్తారని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ప్రత్యేక అతిథిగా వచ్చి, తమ టీ స్టాల్ ను సందర్శించడంతో ఆనందానికి లోనయ్యారు టీ కొట్టు యజమానులు.